Header Banner

ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లో భూసేకరణ! ఇక 8 గంటల్లో విశాఖ!

  Tue May 20, 2025 12:09        Others

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్రం కలిసి అమరావతికి తెలంగాణకు మధ్య గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నాయి. విజయవాడ-ఖమ్మం మధ్య రాకపోకలు సులభతరం చేయడానికి భూసేకరణ చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 30 కిలోమీటర్ల మేర రహదారి కోసం భూమిని సేకరిస్తున్నారు. ఈ హైవే పూర్తయితే హైదరాబాద్ నుంచి విశాఖపట్నంకు ప్రయాణం మరింత సులభం అవుతుంది. ఈ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం ఎంతో శ్రద్ధ తీసుకుంటుంది.

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం సహకారంతో రాష్ట్రంలో నేషనల్ హైవేలు, స్టేట్ హైవేల పనుల్ని వేగవంతం చేస్తోంది. ముఖ్యంగా అమరావతికి కనెక్ట్ అయ్యే రోడ్లపై ఫోకస్ పెట్టింది. తాజాగా అమరావతిని తెలంగాణకు కనెక్ట్ చేసే గ్రీన్‌ఫీల్డ్ హైవే పనుల్లో ప్రభుత్వం స్పీడ్ పెంచింది. విజయవాడ-ఖమ్మం గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే కోసం భూసేకరణను పూర్తిచేసే పనిలో ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో 30 కిలోమీటర్ల మేర ఈ హైవే నిర్మాణం కోసం 329.30 ఎకరాల భూమిని సేకరించాలని భావిస్తున్నారు. ఇప్పటికే 243.67 ఎకరాల భూమిని సేకరించారు. ఇంకా 85.63 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది.. ఈ భూసేకరణ పూర్తయితే, విజయవాడ-ఖమ్మం మధ్య రాకపోకలు మరింత సులువుగా సాగుతాయి అంటున్నారు.

 

విజయవాడ-ఖమ్మం గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే కోసం అధికారులు మిగిలిన భూమిని సేకరించే పనిలో ఉన్నారు. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు ఎక్కువగా ఉండటంతో వాటిని ముందుగా పూర్తి చేస్తారు.. ఆ తర్వాత ప్రైవేటు భూములపై దృష్టి పెడతారు. ఖమ్మం-విజయవాడ మధ్య గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులను మూడు ప్యాకేజీలుగా చేస్తున్నారు. ఇప్పటికే రెండు పనులు మొదలయ్యాయి. ఖమ్మం నుంచి ఎన్టీఆర్ జిల్లా మీదుగా మూడో ప్యాకేజీ పని ప్రారంభం కావాల్సి ఉంది. ఈ మేరకు మిగిలిన భూసేకరణపై ఫోకస్ పెట్టారు. ఖమ్మం జిల్లాలోని రెమిడిచర్ల నుంచి మొదలయ్యే ప్యాకేజ్ 03 గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు గంపలగూడెం మండలంలోని తునికిపాడు దగ్గర ఎన్టీఆర్ జిల్లాలోకి వస్తాయి. ప్రస్తుతం ఇక్కడే భూసేకరణ జరుగుతోంది.


ఇది కూడా చదవండి:  విజయవాడ–బెంగళూరు మధ్య వందేభారత్..! కేవలం 9 గంటల్లో..! 

 

మొత్తం 30 కిలోమీటర్ల రహదారి కోసం 329.30 ఎకరాల భూమి అవసరమని అంచనా వేశారు. ఇందులో 273.73 ఎకరాలు ప్రైవేటు భూములు ఉండగా.. వీటిలో ఇప్పటికే 243.67 ఎకరాలను సేకరించగా.. మరో 30.6 ఎకరాలు మాత్రమే సేకరించాల్సి ఉంది. ఈ భూములతో పాటుగా ప్రభుత్వ భూములు 32.74 ఎకరాలు, అసైన్డ్ ల్యాండ్స్ 22.83 ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది. ఇలా మొత్తం 85.63 ఎకరాల సేకరణ పూర్తయితే గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులకు మార్గం సుగమం అవుతుంది.

 

ఈ హైవేకు సంబంధించి ఎన్టీఆర్ జిల్లాలోని గంపలగూడెం, జి.కొండూరు, విజయవాడ గ్రామీణ మండలాల్లో కలిపి 9,86,125 చదరపు మీటర్ల భూమిని సేకరిస్తున్నారు. గంపలగూడెంలోని తునికిపాడులో 36,704.98 చదరపు మీటర్ల భూమిని సేకరిస్తున్నారు. ఈ హైవే జి.కొండూరు పరిధిలోని గ్రామాల మీదుగా విజయవాడ రూరల్ మండలంలోకి నేషనల్ హైవే వస్తుంది. దీంతో ఈ గ్రామాలన్నింటిలోనూ భూసేకరణ జరుగుతోంది. విజయవాడ రూరల్ మండలంలోని రాయనపాడు, పైడూరుపాడు మీదుగా విజయవాడ శివారులోని జక్కంపూడి వద్ద వెస్ట్ బైపాస్‌కు ఈ రోడ్డు కలుస్తుంది. ఈ మూడు ప్రాంతాల్లోనూ భూసేకరణ చేస్తున్నారు.

 

విజయవాడ-నాగపూర్ ఎకనమిక్ కారిడార్‌లో భాగంగా ఖమ్మం నుంచి గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులు పూర్తి చేస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం-విజయవాడ మధ్య ప్యాకేజీ 1లో వి.వెంకటాయపాలెం నుంచి బ్రాహ్మణపల్లె వరకు 25 కిలోమీటర్లు.. ప్యాకేజీ 2లో బ్రాహ్మణచర్ల నుంచి రెమిడిచర్ల వరకు 28 కిలోమీటర్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించాక రెమిడిచర్ల నుంచి జక్కంపూడి వరకు చేపట్టాల్సిన ప్యాకేజీ 3 పనులే ఆలస్యం అయ్యాయి. మిగిలిన భూసేకరణను త్వరగా పూర్తిచేసి పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు అధికారులు. విజయవాడ దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ హైవేను 165 కిలోమీటర్ల మేర రూ.4,609 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఐదు ప్యాకేజీలు.. 117 అండర్‌పాస్‌లు, 33 కల్వర్టులు, తొమ్మిది భారీ వంతెనలు నిర్మిస్తున్నారు. విజయవాడ నుంచి ఖమ్మం మీదుగా రాజమహేంద్రవరం, విశాఖపట్నం వెళ్లేందుకు ఈ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే మరింత సులభతరం చేస్తుంది అంటున్నారు. ఈ హైవే పూర్తిచేస్తే 8 నుంచి 9 గంటల్లో హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లొచ్చంటున్నారు.

 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #GreenfieldHighway #VijayawadaKhammamRoad #AmaravatiToTelangana #NTRDistrictLandAcquisition #APInfrastructure #HyderabadToVizag #NHDevelopment